Saturday, May 23, 2009

ఆదారం.....

సంద్రానికి ధరణి ఆదారం ....
వెలుగుకి దివ్వె ఆదారం ....
దేహానికి ప్రాణం ఆదారం ....
నీ అదర దరహాసం నాకారాద్యం
నీ మదురదరహాసంతో అవుతా
ముళ్లోకాలకి ఆదారం

Wednesday, April 15, 2009

వోటా?......నోటా?

భారతావనికి నుదుటన బొట్టుకున్న ప్రాదాన్యత,.... ప్రతి భారత పౌరుడి వేలిపై వెయించుకునే నీలి బొట్టుకు ఉంటుంది.
మన వోటుని అమ్ముకున్నామంటే అది మన ఆత్మగౌరవన్ని కుదువపెట్టినట్టే అందుకే మీ వోటుని వేయండి భారతమాత రుపురేఖలని తీర్చిదిద్దండి....... మీ మానాన్ని అమ్మకుండా వోటు వేస్తారిని నా నీరిక్షణ .......జైహింద్

Sunday, November 30, 2008

NaraMedham






ఓ భారతావని ఎటువైపుకీ పయనం
ఆగదా ఈ నరమేధం
భారతజవానుల త్యాగం, ధైర్యం కాదా మన భారతమాతకి నిర్వచనం
ఐనా ఆగదా ఈ మారణహోమం
ఎన్నాళ్ళీ నరహంతకుల రక్తదాహం
ఒక్కసారి భారతజవానులు శాంతస్వభావం కనుముసిన,
రెప్పపాటులో మాయం ఈ మూక
ఎన్నాళ్ళీ గుళ్ళ వర్షం
భారతమూర్తి పొత్తి కడుపుపై
ఎన్నాళ్ళీ ఈ మాతృమూర్తికి కడుపు కోత

ఇంకా కనపడలేదా తన కుమారులైన జవానుల త్యాగం, స్థైర్యం
మీ తల్లులు కని పడేస్తే అయ్యారు అలా!!
మాతృమూర్తి స్పర్శ చాలు రా..కనిపించదా మాతృమూర్తి ప్రేమ
ఇక చాలు ఈ ముష్కర పోరు...
శాస్త్రం చెప్పలేదు ప్రాణాలు తీయమని
భారతావని ఫై ఏమి తక్కువ రా!!
పాలకులు మీరే ..సంస్థాపకులు మీరే
మీ ఫిరంగుల వర్షం భరిస్తూనే ఎగురవేస్తోంది శాంత కపోతాన్ని
ఇంకా కనిపించలేదా మా జవానుల ధీరత్వం
ఇంకా కొనసాగితే రెప్పపాటు సమయం చాలు మీ సామ్రాజ్యం కూకటివేళ్ళతో పెకిలిస్తాం
ఇకనైనా ఆపండి ఈ నరమేధం!!
ఇంకా అగుపించలేదా భరతమాత ముద్దుబిడ్డల ఐక్యత
శంతికోసమై కొనసాగుతూనే ఉంటుంది ఈ నిరీక్షణ.....
జైహింద్ .......

Monday, November 24, 2008

nireekshana






నాలోని ఉచ్వాస నిశ్వాసలు ఆగిన నీకై నా తలంపు మానదే, నామనస్సునకు ఏమని చెప్పను ఇంకా ఎలా అదుపులో పెట్టను.... నీకై తపిస్తున్న నామనస్సు నాపరిమితులు దాటి ఏనాడో అది నీ కాపరాయనె....
ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ.... ఇంకా వినబడలేదా ఈ దీనుడి ఘోశ !..
నీ ప్రేమకై వేచివుండడం .... ఎండమావిలో నీటికై ప్రయత్నించడం అని తెలిసినా వినదే నా మనస్సు .....
నీవులేని ఈ మనస్సుకి నా ఖాయమే వద్దని పరిభ్రమిస్తుంది నీ తోడుకై ....
ఇంకా ఈ నా
నిరీక్షణ ఆయువు అనంతవాయువులో కలిసే వరకు కొనసాగుతుంది...
త్వరలోనే
నీకీ విషయాన్ని తెలిపే రోజొస్తుందని అశిస్తూనే... ఉంటుంది నా పట్టువీడని మనస్సు. వీక్షిద్దాం విధి అనే వింత ప్రయాణం ... ఎటు వైపుందో నా ఘమ్యం....

నాలో చిగురించిన ప్రేమా అనే లే లేత చిగురును ..... చిగురులోనే తున్చేస్తే నీకై ఈ మాను ఉండేది కాదు కదా !! నేస్తమా ...... నా మది నన్ను ఏ నాడో కాలగర్భమున కాలరాసేను .. ఈ నేలపై మిగిలిన ఈ మాను మాను మాత్రమే..... ఇది చలనమున్న మేను ... నా వల్ల నలుగురు నీడ పొందాలనే తపనతో బ్రతుకునీడుస్తున్న కనీసం ఆ కలైనా నెరవేరాలని ఆశిస్తూ ఈ నిరీక్షణ.....




ప్రేమ అనే ప్రతిమనుగాంచి ప్రేయసియనే ప్రేరణలో మయమరిపింపబడి,... సృషించిన వెనువెంటే ముక్కలై వేయి వ్రక్కలై నా జీవత ఘమ్యాన్ని వక్రికరించి ప్రేతాత్మై ట్టికరిపించేదని తెలుసుకున్నా ....
అందుకే.....
ఇహం ప్రేమా తస్మాత్ జాగ్రత్త .....:(