
నాలోని ఉచ్వాస నిశ్వాసలు ఆగిన నీకై నా తలంపు మానదే, నామనస్సునకు ఏమని చెప్పను ఇంకా ఎలా అదుపులో పెట్టను.... నీకై తపిస్తున్న నామనస్సు నాపరిమితులు దాటి ఏనాడో అది నీ కాపరాయనె.... ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ.... ఇంకా వినబడలేదా ఈ దీనుడి ఘోశ !..
నీ ప్రేమకై వేచివుండడం .... ఎండమావిలో నీటికై ప్రయత్నించడం అని తెలిసినా వినదే నా మనస్సు .....
నీవులేని ఈ మనస్సుకి నా ఖాయమే వద్దని పరిభ్రమిస్తుంది నీ తోడుకై ....
ఇంకా ఈ నా నిరీక్షణ ఆయువు అనంతవాయువులో కలిసే వరకు కొనసాగుతుంది...
త్వరలోనే నీకీ విషయాన్ని తెలిపే రోజొస్తుందని అశిస్తూనే... ఉంటుంది నా పట్టువీడని మనస్సు. వీక్షిద్దాం ఈ విధి అనే వింత ప్రయాణం ... ఎటు వైపుందో నా ఘమ్యం....
నాలో చిగురించిన ప్రేమా అనే లే లేత చిగురును ..... చిగురులోనే తున్చేస్తే నీకై ఈ మాను ఉండేది కాదు కదా !! నేస్తమా ...... నా మది నన్ను ఏ నాడో కాలగర్భమున కాలరాసేను .. ఈ నేలపై మిగిలిన ఈ మాను మాను మాత్రమే..... ఇది చలనమున్న మేను ... నా వల్ల నలుగురు నీడ పొందాలనే తపనతో బ్రతుకునీడుస్తున్న కనీసం ఆ కలైనా నెరవేరాలని ఆశిస్తూ ఈ నిరీక్షణ.....
ప్రేమ అనే ప్రతిమనుగాంచి ప్రేయసియనే ప్రేరణలో మయమరిపింపబడి,... సృషించిన వెనువెంటే ముక్కలై వేయి వ్రక్కలై నా జీవత ఘమ్యాన్ని వక్రికరించి ప్రేతాత్మై మట్టికరిపించేదని తెలుసుకున్నా ....
అందుకే.....
ఇహం ప్రేమా తస్మాత్ జాగ్రత్త .....:(

2 comments:
నాలోని ఉచ్వాస నిశ్వాసాలు ఆగిన NEE NIREEKSHANA KU నా తలంపు మానదే.......sneha
Post a Comment