
ఓ భారతావని ఎటువైపుకీ పయనం
ఆగదా ఈ నరమేధం
భారతజవానుల త్యాగం, ధైర్యం కాదా మన భారతమాతకి నిర్వచనం
ఐనా ఆగదా ఈ మారణహోమం
ఎన్నాళ్ళీ నరహంతకుల రక్తదాహం
ఒక్కసారి భారతజవానులు శాంతస్వభావం కనుముసిన,
రెప్పపాటులో మాయం ఈ మూక
ఎన్నాళ్ళీ గుళ్ళ వర్షం భారతమూర్తి పొత్తి కడుపుపై
రెప్పపాటులో మాయం ఈ మూక
ఎన్నాళ్ళీ గుళ్ళ వర్షం భారతమూర్తి పొత్తి కడుపుపై
ఎన్నాళ్ళీ ఈ మాతృమూర్తికి కడుపు కోత
ఇంకా కనపడలేదా తన కుమారులైన జవానుల త్యాగం, స్థైర్యం
మీ తల్లులు కని పడేస్తే అయ్యారు అలా!!
ఈ మాతృమూర్తి స్పర్శ చాలు రా..కనిపించదా మాతృమూర్తి ప్రేమ
ఇక చాలు ఈ ముష్కర పోరు...
ఏ శాస్త్రం చెప్పలేదు ప్రాణాలు తీయమని
ఈ భారతావని ఫై ఏమి తక్కువ రా!!
ఏ శాస్త్రం చెప్పలేదు ప్రాణాలు తీయమని
ఈ భారతావని ఫై ఏమి తక్కువ రా!!
పాలకులు మీరే ..సంస్థాపకులు మీరే
మీ ఫిరంగుల వర్షం భరిస్తూనే ఎగురవేస్తోంది శాంత కపోతాన్ని
ఇంకా కనిపించలేదా మా జవానుల ధీరత్వం
ఇంకా కొనసాగితే రెప్పపాటు సమయం చాలు మీ సామ్రాజ్యం కూకటివేళ్ళతో పెకిలిస్తాం
ఇకనైనా ఆపండి ఈ నరమేధం!!
ఇంకా అగుపించలేదా భరతమాత ముద్దుబిడ్డల ఐక్యత
శంతికోసమై కొనసాగుతూనే ఉంటుంది ఈ నిరీక్షణ.....
జైహింద్ .......

